AP&TG

ఆంధ్రప్రదేశ్‌ తీరంవైపు వేగంగా కదులుతున్నవాయుగుండం-తీవ్ర తుఫానుగా మారే అవకాశం

నెల్లూరు–నర్సాపురం మధ్య మంగళవారం తీరం దాటే సూచనలు

తీరం దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ. వేగంతో గాలులు

దక్షిణ కోస్తా, రాయలసీమలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు వేగంగా కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ  వెల్లడించింది. నవంబర్ 1వ తేది ఉదయం 7.30 గంటల నాటికి ఈ వాయుగుండం చెన్నైకి 830 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 880 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 900 కిలోమీటర్లు, ఒంగోలుకు 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తుఫానుగా బలపడే అవకాశం:- ఆదివారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా, అర్ధరాత్రికి తుఫానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడే సూచనలున్నాయని పేర్కొంది.

మంగళవారం తీరం దాటే అవకాశం:- మంగళవారం తెల్లవారుజామున దక్షిణ కోస్తా తీరానికి సమీపంలోకి చేరుకుని, అదే రోజు ఉదయం తీవ్ర తుఫానుగా నెల్లూరు–నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు:-  తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

మూడు రోజుల పాటు భారీ వర్షాలుL:- తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని IMD సూచించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *