AP&TG

అల్పపీడనం శనివారం వాయుగుండంగా బలపడే అవకాశం-వాతావరణశాఖ

అమరావతి: అండమాన్ సముద్రంలో అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారి ఆటు తరువాత 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో  రానున్న 3 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.

వాయుగుండంగా బలపడే అవకాశం:- అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న నికోబార్ దీవుల ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసరాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతరం రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శనివారం వర్ష సూచన:- మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురవవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఆదివారం:- కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది.

సోమవారం:- తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వెల్లడించింది.

పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు:- రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు గణనీయమైన వర్షపాతం నమోదైంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *