ఆంధ్రప్రదేశ్ లో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించాం-అశ్విని వైష్ణవ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని,,యుపిఏ పాలన కంటే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువని కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.. సోమవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఏపీలోని 73 స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని వెల్లడించారు..2026 లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు..ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో కవచ్ టెక్నాలజీని వేగంగా ఏర్పాటు చేస్తున్నామని,, త్వరలో అన్ని చోట్ల పూర్తిచేస్తామన్నారు..సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.. త్వరలోనే దేశవ్యాప్తంగా 200 వందే భారత్ రైళ్లు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు..భారతీయ రైల్వే కోసం 2.52 లక్షల కోట్లను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు..రైల్వేబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,417 కోట్లు కేటాయింపులు జరిగాయని,,రూ.84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు..ఏపీలో 73 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని,,1560 కి.మీ.కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేశామని తెలిపారు.