అయోధ్య రామాలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ ఆరోగ్య పరిస్థితి విషమం
అమరావతి: అయోధ్య రామాలయం ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ (85)కు అదివారం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్పించారు.. SGPGI లో సత్యేంద్ర దాస్ కు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు..ప్రస్తుతం సత్యేంద్ర దాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని,, బీపీ, షుగర్ తో ఆయన బాధపడుతున్నరని వైద్యులు తెలిపారు..తాము అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని,,ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారని చెప్పారు..అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో కీలక భూమిక పోషించారు..1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం అయన తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా ఉన్నారు..సత్యేంద్ర దాస్‌కు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నిర్వాణి అఖాడాలో చేరి, ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు.