డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎంపిక
నెల్లూరు: నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా 48వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ తహసీన్ ఎంపికయ్యారు. జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ ప్రిసైడింగ్ అధికారిగా అధ్యక్షత వహించి కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ కరీముల్లా ఎన్నికలో పాల్గొన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా సయ్యద్ తహసీన్ పాల్గొన్నారు. ఇద్దరు అభ్యర్థులకు మద్దతుదారులు చేతులు ఎత్తి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. కరీముల్లాకు 12 ఓట్లు రాగా తహసీన్ కు 41 ఓట్లు నమోదు అయ్యాయి.డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి కె.కార్తీక్ ప్రకటించారు. ఎన్నిక ప్రక్రియలో రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.