బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాం
అమరావతి: బాలీవుడ్ నటుడు, శివసేన (ఏకనాధ్ షిండే)లీడర్ గోవిందా పరన్సల్ రివాల్వర్ మిస్‌ఫైర్ అయ్యింది.. మంగళవారం తెల్లవారుజామున 4:45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది..కోల్ కత్తాకు వెళ్లేందుకు గోవిందా సిద్ధమవుతున్న క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ పోరపాటున చేయ్యి నుంచి జారీ క్రింద పడింది.. మిస్‌ఫైర్ అయిన అందులోని బుల్లెట్ గోవిందా మోకాల్లోకి దూసుకెళ్లింది..ఈ ఘటనలో గోవిందా తీవ్రంగా గాయపడ్డారు.. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రికి తరలించారు..వైద్యులు అతడికి చికిత్స చేసి బుల్లెట్ తొలగించారని అయన వ్యక్తి గత కార్యదర్శి శశిసిన్హా తెలిపారు..ప్రస్తుతం గోవిందా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని వెల్లడించారు.