NATIONAL

క్రేజీవాల్ అధికారిక నివాసంపై వచ్చిన అవినితి ఆరోపణలపై విచారణకు అదేశించిన కేంద్రం

అమరావతి: అన్నాహాజరే అవినితి వ్యతిరేక ఉద్యమంను వేదికగా చేసుకుని,,రాజకీయంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన అరవింద్ కేజ్రీవాల్,గుట్టు చప్పుడు కాకుండా చేసిన అవినితి భాగొతాలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటి బయట పెడుతు వస్తొంది..ఇందులో బాగంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘శీష్‌ మహల్‌’  వ్యవహారం వివాదాస్పదమైంది..అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు శీష్ మహల్ పునరుద్ధరణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.. కేంద్ర ప్రజాపనుల విభాగం నివేదిక సమర్పించిన తరువాత ఫిబ్రవరి 13న సమగ్ర విచారణకు ఆదేశించింది.. 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ఆధునీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వివరణాత్మక నివేదిక తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది.

ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా పని చేసిన సమయంలో సివిల్‌ లైన్స్‌ లో ఆయన అధికారిక నివాసంగా మార్చుకున్నారు..ఢిల్లీ సీఎం అధికార నివాసాన్ని దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు ఆరోపిస్తోంది..సదరు బంగ్లా రీమోడల్ లో భాగంగా టాయిలెట్‌లో గోల్డెన్‌ కమోడ్‌,,స్విమ్మింగ్‌ పూల్‌,, మినీ బార్‌ వంటివి ఏర్పాటు చేసుకున్నారని,,ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్‌ జరిగిందని తీవ్ర స్థాయిలో బీజెపీ నాయకులు ఆరోపణలు చేశారు..బీజెపీ నాయకులు ఆరోపణలపై నివేదిక నిజాలను నిగ్గుతేల్చాసి వుంది.?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *