రాష్ట్రంను స్వచ్ఛాంధ్రగా చేసేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలి-సీఎం చంద్రబాబు
నెల్లూరు,కందుకూరు: స్వచ్చాంధ్ర ,స్వచ్చ దివస్ కార్యక్రమంలో బాగంగా ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని,, పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు..శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటించారు..కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం, దూబగుంటలో గ్రామస్థులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.. నియోజవర్గంలోని దూబగుంట గ్రామ పర్యటనకు ఆర్భాటాలకు తావు లేకుండా సామాన్య వ్యక్తిలా వచ్చారు..తొలుత దూబగుంట గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించిన ముఖ్యమంత్రి గ్రామంలో భీమని హరికృష్ణ ఇంటిలో ఇంకుడుగుంతను పరిశీలించి ఆయా వివరాలు తెలుసుకున్నారు..అనంతరం మరో గ్రామస్తురాలు గొర్రెపాటి సుశీల ఇంటి వద్ద ఆగి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నారా అని విచారిస్తూ ముందుకు సాగారు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద ఆగి వారిని పరామర్శించిన ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ అందుతుందాయని ఆరా తీశారు.. వారు సేంద్రీయ పద్ధతిలో సాగుచేసిన అరటిపండ్ల గెలను ముఖ్యమంత్రికి అందజేశారు. గ్రామ మహిళ లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. సుమలత మాట్లాడుతూ పరిశుభ్రతను పెంపొందించడానికి స్వచ్చాంద్ర 5 సూత్రాలైన వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పరిశుభ్రత, ఇల్లూ, పరిసరాల పరిశుభ్రత, నీరు, గాలి పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత తదితర అంశాలను తాను ఆచరించడమే కాకుండా గ్రామస్తులకు సైతం అవగాహన కల్పిస్తున్నానన్నారు. దాంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ అందరూ ఇటువంటి చైతన్యం కలిగి ఉండాలన్నారు.