రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
తిరుపతి: ఆగస్టు నెలకు సంబంధించిన ఆన్ లైన్ ఆర్జిత,ఇతర టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ తెలిపింది..సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవాలకు ఎలక్ట్రానిక్ డిప్ వుంటుందని,,మే 21వ తేదీన ఉదయం 10 గంటల వరకు నమోదుకు అవకాశం వుందన్నారు..మే22 తేదీన ఉదయం 10 గంటలకు మరిన్ని ఆర్జిత సేవాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు..మే 22 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవాలు విడుదల,,మే23 తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల,,మే 23 తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదల,,మే 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు,దివ్యాంగుల టోకెన్లు విడుదల,,మే 24వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల,,మే 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు విడుదల,,మే29 తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా కోటా విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.