“పురమిత్ర”యాప్ తో ఆన్లైన్ సేవలు సులభతరం-నందన్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ రూపొందించిన పురమిత్ర యాప్ ద్వారా ఆన్లైన్ సేవలు సులభతరం అవుతాయని నెల్లూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ తెలిపారు.. పురమిత్ర మొబైల్ యాప్ ను సీ.ఎం చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించారు. కమీషనర్-డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యాప్ పనితీరును వివరించారు. పురమిత్ర ఫోన్ యాప్ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపు, తాగునీటి కుళాయి పన్ను, ట్రేడ్ లైసెన్స్, శివరేజ్ టాక్స్, ప్రాపర్టీ మ్యూటేషన్ ఫీజు, లీజ్ అండ్ అగ్రిమెంట్స్ ఫీజ్, అడ్వర్టైజ్మెంట్ టాక్స్ లను సులభంగా చెల్లించవచ్చని తెలిపారు.సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, సిబ్బంది పాల్గొన్నారు.