అంతరిక్షకేంద్రం నుంచి మార్చి 19వ తేదిన భూమికి చేరుకోనున్న సునీతా విలియమ్స్
అమరావతి: అంతరిక్షకేంద్రంలో గత 9 నెలల నుంచి చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చేందుకు మార్గం దాదాపు సుగమమైంది.. నాసా-స్పేస్ ఎక్స్ సంస్థలు చేపట్టిన క్రూ-10 మిషన్ ISSతో అదివారం 9:40 గంటలకు విజయవంతంగా అనుసంధానమైనట్లు నాసా వెల్లడించింది..నాసా-స్పేస్ ఎక్స్ లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్‌ను భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది..ఈ ప్రయోగం ద్వారా నలుగురు వ్యోమగాములు మెక్‌క్లెయిన్,, నికోల్ అయర్స్,,టకుయా ఒనిషి,,కిరిల్ పెస్కోవ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.. ఈ నలుగురు వ్యోమగాములు సునీతా విలియమ్స్,,బుచ్ విల్మోర్ స్థానంలో విధులు నిర్వహిస్తారు..అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేసినట్లయితే మార్చి 19వ తేదిన వీరు భూమికి చేరుకుంటారు..