సినిమా కామిడీ క్యారక్టర్ నటుడు ఫిష్ వెంకట్ కు రూప.2 లక్షలు సాయం అందించిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తొడ కొట్టు చిన్న అన్న డైలాగ్ తో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. సినిమా షూటింగులకు వెళ్లేందుకు శరీరం ఏ మాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు..ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు.. డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురికావడంతో పాటు వెంకట్ రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి..అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్,, ఏ.ఫి డిప్యూటివ్ సి.ఎం పవన్ కళ్యాణ్ ను కలసి తన పరిస్థితి తెలియ చేశారు..దింతో వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందించారు..ఈ విషయాన్ని వెంకట్ ఓ వీడియో ద్వారా తెలిపారు.