AP&TG

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగింది.. ఈ సమావేశంలో 14 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది..14 ఎంజెడా అంశాలపై కేబినెట్‌ సమావేశం కాగా సుదీర్ఘంగా చర్చల అనంతరం వీటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. 

క్యాబినెట్‌ సమావేశంలో అంశాలు:- చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించాల్సిన స్థలంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది..విశాఖలో టీసీఎస్ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది..రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో రూ.83 వేల కోట్ల పెట్టుబడుల‌కు ఆమోద ముద్ర పడింది.

సీఆర్‌డీఏ 44వ సమావేశంలో తీసుకున్న రెండు పనులకు మంత్రివర్గం ఆమోదం,,మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌,,భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు ఆమోదం,,పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు పచ్చజెండా,, నంద్యాలతో పాటు వైఎస్సార్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అంగీకారం,, తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రి పడకలను 100కు పెంపు,,వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమ్మ ఒడి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం,,రైతులకు కేంద్రం ఇస్తున్న 10 వేలతో పాటు రాష్ట్ర కూడా అదే సమయంలో మరో 10 వేలు ఇవ్వాలని నిర్ణయం,, మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం,, రాష్ట్రంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది..

కేబినెట్ ముగిసిన తరువాత మంత్రులతో సీఎం విడిగా సమావేశం అయ్యారు..జనవరి 8న వైజాగ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపధ్యంలో ప్రధాని రాష్ట్ర పర్యటనపై క్యాబినెట్ లో చర్చ జరిగింది..పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయాల్సిన అంశాలపై కూడా చర్చ జరిగింది.. ప్రధాని పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు.. గోదావరి – బనక చర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గానికి సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు..ప్రస్తుత సమయంలో ఈ ప్రాజెక్టు ను ప్రారంభించకపోతే నిర్మాణ అంచనా వ్యయం ఏడాదికి 40 వేల కోట్లు పెరుగుతుందని,,కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *