AP&TG

హైదరాబాద్​లో ఈదురుగాలులతో భారీవర్షం-చెరువులను తలపిస్తున్న రోడ్లు

హైదరాబాద్‌:  హైదరాబాద్​లో శుక్రవారం వర్షం మరోసారి బీభత్సం సృష్టిస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులతో మొదలైన వాన నగరమంతా క్రమక్రమంగా విస్తరిస్తోంది.ఈదురు గాలులతో పలు చోట్ల భారీ వర్షం కారణంగా రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.నాంపల్లి, హిమాయత్ నగర్​, ముషీరాబాద్​, ఖైరతాబాద్‌లో ఒక్కసారిగా ఈదురు గాలులలో వాన కురుస్తోంది. గాలుల ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కుత్బుల్లాపూర్, దుండిగల్, సుచిత్ర, కొంపల్లి, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో మోస్తరు వర్షం పడుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలో ముందుగా ఈదురుగాలులు భయంకరమైన వాతావరణం సృష్టించాయి. తరువాత భారీ వర్షం మొదలైంది.

విద్యుత్​ సరఫరాకు అంతరాయం:- అమీర్​పేట్, పంజాగుట్ట, మధుర నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పరిసరాల ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అటు కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, కార్వాన్, ఎల్బీనగర్, వనస్థలిపురం, భాగ్యలతా, హయత్​నగర్​, పెద్ద అంబర్​పేట్, అబ్దుల్లాపూర్​మెట్​ ప్రాంతంలోనూ వర్షం మొదలైంది. విద్యత్​ సరఫరాలో అంతరాయం కారణంగా నిలిచిపోయింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ లో రాత్రి 9 గంటల నిమిషాల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *