AP&TGNATIONAL

పాకిస్తాన్ కు చెందిన 16 యూట్యూబ్ ఛానెల్‌లపై నిషేధం-BBCకి నోటీసులు

ఇంధిరాగాంధీ BBCని బ్యాన్ చేసింది…మరి ఇప్పుడొ?

అమరావతి: పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తరువాత ఇస్లామాబాద్‌తో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో సహా భారతదేశం పలు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో “రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేయడం” &”భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం” వ్యాప్తి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించింది..

భారతదేశం, భారత సైన్యం & భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుదారి పట్టించే కథనాలు,, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది.. యూట్యూబ్‌ ఛానళ్లు, రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్‌ వ్యాప్తి, అలాగే భారత దేశం, భారత సైన్యం, భద్రతా సంస్థలను లక్ష్యంగా చేసుకొని తప్పుదారి పట్టించే కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించింది.. జాబితాలో మొదటిది డాన్ యొక్క యూట్యూబ్ పేజీ, ఇది 1941లో ముహమ్మద్ అలీ జిన్నాచే బ్రిటిష్ ఇండియాలో ప్రారంభించబడిన పాకిస్తానీ ఆంగ్ల భాషా వార్తాపత్రిక.. ఇది పాకిస్తాన్‌లో అతిపెద్ద ఆంగ్ల వార్తాపత్రిక & ఆ దేశంలోని రికార్డు వార్తాపత్రికగా చెప్పుకుంటారు.. “భారతదేశంపై మొదటి నుంచి విషంకక్కే బ్రిటీష్ న్యూస్ ఛానల్”,, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి తప్పదారి పట్టించే కథనాలు ప్రసారం చేసింది.. పాక్‌కు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడంతో BBCకి నోటీసులు జారీ చేసింది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *