విశాఖపట్నం అండర్ గ్రౌండ్ డ్రైనేజి ప్రాజెక్ట్ పనులపై సమీక్ష నిర్వహంచిన మంత్రి నారాయణ
అమరావతి: విశాఖపట్నం అండర్ గ్రౌండ్ డ్రైనేజి ప్రాజెక్ట్ పనులపై మునిసిపాల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం అమరావతిలో ప్రాజెక్టు చేపట్టిన కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టాటా ప్రాజెక్ట్స్ 412 కోట్లతో 226 కిమీ మేర మొదటి ప్యాకేజీలో యూజీడీ నిర్మాణం చేపట్టింది..మొదటి ఫేజ్ లో పెందుర్తి ఏరియాలో,రెండో ప్యాకేజిలో గాజువాక,మల్కాపురం ప్రాంతంలో యూజీడీ పనులు పూర్తి చేయాలని,, మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు రీసైక్లింగ్ వాటర్ ను హెచ్ పీసీఎల్,స్టీల్ ప్లాంట్ కు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు..సెప్టెంబర్ నెలాఖరుకు మొదటి ప్యాకేజి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు మంత్రి నారాయణ ఆదేశించారు..అలాగే పెండింగ్ బిల్లులు త్వరితగతిన విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు..ఈ నెల 26వ తేదిన మరోసారి అధికారులు,కాంట్రాక్టు సంస్థలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.. మంత్రి నారాయణ వచ్చే వారం విశాఖలో పర్యటించి పనులు పరిశీలించనున్నారు.సమీక్ష సమావేశంలో ఇంజినీరింగ్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.