వివేక హాత్యకేసులో ముద్దాయిలు ఏవరనేది త్వరలోనే బయటకు వస్తుంది-చంద్రబాబు
రాష్ట్రానికి కేంద్రం చేసిన అర్దిక సాయం…
అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్ల విధ్వంసం ఫలితంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టుకోలేని ఘోరమైన పరిస్థితి నెలకొందని,, రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ ను పెట్టాలనే నిర్ణయం తీసుకున్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు..మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్ర అవసరాలను గుర్తించినందుకు ప్రధాని,,కేంద్ర ఆర్థికమంత్రికి ధన్యవాదాలు తెలిపారు..ఆంధ్రప్రదేశ్ రాజధాని,, పోలవరం,, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించారని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీ,, నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు..వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని,, రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు.. అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయంపై బడ్జెట్‌లో పెట్టడడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు.. జగన్ పాలనలో మంచి రాష్ట్రం సర్వ నాశనమైందని,, హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని అన్నారు.. వివేకా హత్య కేసు పలు మలుపులు తిరిగిందని,, హత్య జరిగాక ఘటనాస్థలికి వెళ్లిన సీఐ సీబీఐకి విషయం తెలపడానికి సిద్ధపడ్డారని తెలిపారు.. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చిందని గుర్తు చేశారు.. హత్య కేసు విచారణాధికారిపై కేసు పెడితే సదరు అధికారి హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.. నేరస్థుడే సీఎం అయితే పోలీసులు కూడా వంతన పాడే పరిస్థితి నెలకొందని,,వివేకా హత్య కేసు నిందితుల అరెస్టుకు కర్నూలుకు వెళ్లిన సీబీఐ సిబ్బంది తిరిగి వచ్చిన విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేశారు.