నెల్లూరు జిల్లాకు చెందిన టూరిస్ట్ బస్సు ప్రమాదం- ముగ్గురు ప్రయాణికులు మృతి
8 మంది పరిస్థితి కాస్త తీవ్రం..
అమరావతి: బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్ర టూరిస్ట్ బస్సు సోమవారం 1 గంట ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం, ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ లైన్ హోటల్ సమీపంలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతివేగంతో ప్రయాణిస్తు, ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించాగా మరో 22 మందికి గాయాలు అయ్యాయి. ఇందులో 8 మంది పరిస్థితి కాస్త తీవ్రంగా వుండడంతో వారిని గయాలోని అనుగ్రహ నారాయణ మగధ్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో ఈ నెల 1వ తేదిన కాశీ యాత్రకు బయులుదేరి వెళ్లారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఓ మహిళ మరణించారు.వీరిలో పద్మ (42), వెంకటేశం (62), హజరత్ (61)లు వున్నట్లు సమాచారం?
ముఖ్యమంత్రి:- బీహార్లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందించేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

