ఫిలిప్పీన్స్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం-20 మంది మృతి
అమరావతి: సోమవారం దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 7.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా కనీసం 20 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతమంతటా సునామీ హెచ్చరికలను జారీ చేయడంతో పాటు, తీరప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. భూకంప కేంద్రం సమీపంలో విద్యుత్, సమాచార సేవలకు అంతరాయం ఏర్పడింది.
జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం, మిండానో సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీంతో బలమైన భూ ప్రకంపనలు, సునామీలు ఏర్పడతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.సదరు సంస్థ మొదట భూకంప తీవ్రతను 7.8 తీవ్రతగా నిర్ధారించింది.
దీని ప్రభావం కారణంగా ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా, మలేసియా తదితర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు వెంటనే ఎత్తయిన ప్రాంతాలకు తరలిపోవాలని ఫిలిప్పీన్స్ అగ్నిపర్వతాలు, భూకంపాల పరిశోధనా సంస్థ (ఫివోల్క్స్) హెచ్చరించింది. సాధారణ సముద్ర మట్టానికి 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు ఎగిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 3 కిలోమీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది.

