DISTRICTS

ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి తాగునీటి శాంపిల్లను పరిశీలించిన కమీషనర్

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి తాగునీటి శాంపిల్లను సేకరించి నాణ్యత పరీక్షలను కమిషనర్ సమక్షంలో పి.పి.ఎమ్ కిట్ల ద్వారా అధికారులు నిర్వహించారు. ఫలితాల అనంతరం తాగునీటి రంగు, వాసనలను కమిషనర్ పరిశీలించి, నీటిని తాగిన అనంతరం సంతృప్తిని వ్యక్తం చేశారు. తాగునీటి నాణ్యత పై ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల వద్ద క్రమం తప్పకుండా జరిపే తాగునీటి పరీక్షలను స్వయంగా పరిశీలించవచ్చని కమిషనర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, అమెనిటీస్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *