NATIONALOTHERSTECHNOLOGY

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న టన్నెల్ జోజిలా టన్నెల్

బ్రేక్ త్రూ 9వ తదిన..

అమరావతి: జమ్మూ & కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలను 24X7 అనుసంధానించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ టన్నెల్ తుది బ్రేక్ త్రూ మంగళవారం జరగనుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ జోజిలా టన్నెల్ తుది బ్రేక్ త్రూ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 13.153 కిలోమీటర్ల పొడవైన జోజిలా టన్నెల్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న అత్యంత పొడవైన సింగిల్-ట్యూబ్ ద్విముఖ రహదారి సొరంగంగా గుర్తింపు పొందింది. ఈ టన్నెల్ తుది బ్రేక్‌త్రూ భారత మౌలిక సదుపాయాల చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా నిలవనుంది. నక్క జిత్తుల చైనా,ఆటలు జోజిలా టన్నెల్ తో చెక్ పడనున్నది.

ప్రాజెక్టు విశేషాలు:- జోజిలా ప్రాజెక్ట్ మొత్తం పొడవు రోడ్లు, వంతెనలతో కలిపి 30.894 కి.మీ. ఇందులో జోజిలా ప్రధాన టన్నెల్ పొడవు  13.153 కి.మీ. నిల్‌గ్రార్ టన్నెల్ T1 పొడవు 457.35 మీటర్లు. నిల్‌గ్రార్ టన్నెల్ T2 పొడవు 1,953.63 మీటర్లు(సుమారు రెండు కిలోమీటర్లు) ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) తరఫున హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) నిర్మిస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *