కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్న”బిగ్ బాస్కెట్”పై కేసు నమోదు
నెల్లూరు: కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్న”బిగ్ బాస్కెట్” విక్రయిస్తున్నరంటూ ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో,పుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం సదరు సంస్థలో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి….నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో నిర్వహిస్తున్న ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్ (బిగ్ బాస్కెట్) ఆన్లైన్ ఆహార వ్యాపార సంస్థను పుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు.తనిఖీ సందర్భంగా సంబంధిత స్టోర్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించగా, వినియోగదారులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచిన పలు ఆహార ఉత్పత్తులలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.
బుధవారం ఒక వినియోగదారునికి సరఫరా చేసిన పెరుగు డబ్బాపై 31-05-2026 గడువు తేదీ ముగిసినట్లు గమనించిన వినియోగదారుడు వెంటనే ఆహార భద్రత శాఖకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తనిఖీలలో సదరు స్టోర్‌లో గడువు ముగిసిన ఇతర ఆహార ఉత్పత్తులు కూడా నిల్వ ఉంచినట్లు గుర్తించబడింది. 1. అక్షయకల్ప ఆర్గానిక్ సెట్ కర్డ్ – గడువు తేదీ 31-05-2026, 2. ఎపిగామియా గ్రీక్ యోగర్ట్ – గడువు తేదీ 30-05-2026, ఆవిన్ పనీర్ – గడువు తేదీ 27-05-2026, 4. అక్షయకల్ప ఆర్గానిక్ మలై పనీర్ – గడువు తేదీ 23-05-2026, 5. మిల్కీ మిస్ట్ స్కైర్ హై ప్రోటీన్ యోగర్ట్ – గడువు తేదీ 02-06-2026, 6. అక్షయకల్ప ఆర్గానిక్ మలై పనీర్ – గడువు తేదీ 29-05-2026, 7. మూజ్ ఫోర్మాజియో సోయా పన్నీర్ – గడువు తేదీ 17-05-2026, 8. ఫ్రుగివోర్ ఫ్రోజెన్ బ్లూబెర్రీస్ – ప్యాకెట్లు ఉబ్బిన స్థితిలో గుర్తించబడినది, 9. బూంది ప్యాకెట్లు – తయారీ తేదీ 20-02-2026, గడువు ముగిసినది.
జె.సీ అదేశాలు వచ్చిన తరువాత చర్యలు:- సదరు స్టోర్‌పై ఆహార భద్రత-ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం కేసు నమోదు చేసి, జాయింట్ కలెక్టర్ కు రిపోర్టు అంచేయడం జరిగిందని,జె.సీ అదేశాలు వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వినియోగదారులు గడువు తేదీని పరిశీలించాలి:- వినియోగదారులు ఆన్లైన్ ద్వారా డెలివరీ చేయబడిన ఆహార పదార్థాలను పూర్తిగా నమ్మి వెంటనే వినియోగించకుండా, వాటి లేబుళ్లపై పేర్కొన్న తయారీ తేదీ, గడువు తేదీ-ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించడమైనది. ఈ తనిఖీలలో నెల్లూరు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జి.వెంకటేశ్వరరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎం.ప్రణుతి ఫ్లోరా పాల్గొన్నారు.

