రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: రాయలసీమ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక రాగల మూడు గంటల్లో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గంటకు 50-60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు, రైతులు, పశుకాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. రాష్ట్రంలో ఎండలు స్వల్పంగా తగ్గి కొన్నిచోట్ల 42°-44°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
అదివారం:- పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు…. అనంతపురం, శ్రీసత్యసాయి,కడప, అన్నమయ్య,చిత్తూరు మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఆకస్మికంగా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం.

