NATIONAL

రాజస్థాన్ లో ఇసుక తుపాన్ కల్లోలం

అమరావతి: రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేసవి ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలపై ప్రకృతి ఊహించని విధంగా ఇసుక తుపాను రూపంలో విరుచుకుపడింది. రాజస్థాన్‌లోని చురు జిల్లా శనివారం మధ్యాహ్నం ఒక భీకర ఇసుక తుపాను గుప్పిట్లోకి చిక్కుకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా రంగు మారి, భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేశాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇసుక గోడలా విరుచుకుపడటంతో, పట్టపగలే చిమ్మచీకటి అలుముకుంది. గాలిలో ఇసుక రేణువుల ధాటికి వాహనదారులు కనీసం ఎదురుగా ఉన్న రోడ్డును కూడా చూడలేక వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *