రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్, ప్రాసెసింగ్ పై భారత్-అమెరికాలు ద్వైపాక్షిక ఒప్పందం
చైనా ఏకచ్ఛాత్రాధిపత్యం..
అమరావతి: రేర్ ఎర్త్ మినరల్స్, అరుదైన లోహాల మైనింగ్, ప్రాసెసింగ్, వాటి సురక్షిత సరఫరాలే లక్ష్యంగా, భారత్-అమెరికాలు చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి, సప్లై చైన్లను వైవిధ్యపరచడానికి మంగళవారం చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఈ ఒప్పందానికి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు, క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం గురించి అధికారికంగా ప్రకటించారు.

