NATIONALOTHERSTECHNOLOGY

“ఇండియాస్ హైపర్సోనిక్ ‘బ్రహ్మాస్త్ర'” ప్రయోగం విజయవంతం

మాక్ 10 వేగంతో…

అమరావతి: ఒడిశా తీరంలోని (టెస్ట్ రేంజ్) రక్షణ కేంద్రం నుంచి భారతదేశం లాంగ్ రేంజ్ నౌకా విధ్వంసక హైపర్‌సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.( Long Range Anti-Ship Missile (LRAShM) LRAShM క్షిపణి 1,500 కిలోమీటర్లకు పైగా పరిధిలోని యుద్దనౌకలను ధ్వసం చేయగలదు.ఈ మిసైల్ ను ప్రయోగించిన క్షణాల వ్యవధిలో (ధ్వని వెగం కటేం 10 రేట్లు) ఇది మాక్ 10 వరకు వేగాన్ని అందుకోగలదు. అత్యంత వేగంతో టార్గెట్ ను తాకే సామర్థ్యంతో పాటు అధునాతన ఎయిర్ రాడార్స్ వ్యవస్థలకు అందకుండా ప్రయాణిస్తుంది.శత్రువులకు చెందిన అతి భారీ వార్ షిప్ లను నాశనం చేస్తుంది.

నాలుగు దేశాలు జాబితలో:- 2026 సంవత్సరం తొలి నుంచి దీనిని భారత నౌకాదళం కోసం DRDO ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. దీంతో అత్యంత అధునాతనమైన హైపర్‌సోనిక్ యాంటీ-షిప్ గ్లైడ్ టెక్నాలజీ కలిగిన కేవలం నాలుగు దేశాలు జాబితలో (అమెరికా, రష్యా, చైనాల తరువాత భారతదేశం) చేరింది.

ఎక్కడి నుంచి అయిన ప్రయోగం:- భూమిపైన ప్రయాణించే ట్రక్ లాంచర్లు (TEL), నౌకాదళం,జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు.

వార్‌హెడ్: సాంప్రదాయ వార్‌హెడ్ తో పాటు మల్టీ పేలోడ్‌లను మోసుకుని వెళ్లగలదు. ఇండియన్ నేవీ,,ఆర్మీ,,ఎయిర్ ఫోర్స్ లకు అందించడానికి హైపర్సోనిక్ ‘బ్రహ్మాస్త్ర’ భారీస్థాయి ఉత్పత్తికి సిద్దం అయింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *