AP&TG

భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

మన్యం జిల్లాలో 45.2°C

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం 28 మండలాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు, అధిక వేడి, ఊపిరాడకపోవడం వంటి వాటి నుండి రక్షణ కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

శుక్రవారం మన్యం(జి) సాలూరులో 45.2°C, కర్నూలు(జి) నగరడోనలో 43.7°C, నంద్యాల(జి) గోస్పాడులో 43.6°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *