కేరళలొని త్రిస్సూర్‌లో ఓ బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు-6 మంది మృతి
అమరావతి: కేరళ రాష్టంలోని త్రిస్సూర్‌లో ఓ బాణసంచా ఉత్పత్తి కేంద్రంలో మంగళవారం మధ్యహ్నం 3 గంటల సమయంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 6 మృతి చెందగా మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించమని, వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కేరళ విపత్తులన నిర్వహణ సంస్థ వెల్లడించింది.
త్రిస్సూర్ తిరువంబడిలోని ఓ బాణసంచా తయారీ యూనిట్లో,,ఈ నెల 24న జరగాల్సిన నమూనా బాణసంచా కోసం సదరు కేంద్రంలో బాణాసంచాలు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ శబ్దం సుమారు కొన్ని కిలోమీటర్ల మేర వినిపించినట్టు స్థానికులు తెలిపారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో మరోసారి పేలుడు సంభవించిన కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయని అక్కడి విపత్తులన నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఆ యూనిట్లో పేలని బాణసంచా పదార్థాలు ఇంకా ఉన్నాయనే అనుమానంతో.. అత్యంత జాగ్రత్తగా సహాయక కార్యకలాపాలు సాగుతున్నాయి. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి వుంది.?

