AP&TG

గురువారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత, నంద్యాల 45. 1°C

అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం గరిష్ఠంగా నంద్యాల జిల్లా సంజామలలో 45.1డిగ్రీలు నమోదైందని తెలిపారు.215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు.

శుక్రవారం (17-04-26):- మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43-44.5°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు.30 మండలాల్లో తీవ్రవడగాలులు, 55 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

నమెదైన ఉష్ణోగ్రతలు:-  గురువారం నంద్యాల(జి) సంజామలలో 45. 1°C,  కడప (జి) ఒంటిమిట్టలో  44.9°C,  మార్కాపురం(జి) అనుమలపల్లిలో 44.2°C, శ్రీసత్యసాయి(జి) ముడిగుబ్బలో 43.5°C,  అనంతపురం(జి) తెరన్నపల్లి, తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 43.4°C, కర్నూలు(జి) బస్తిపాడు 43.2°C, అన్నమయ్య(జి) నూలివీడు, పల్నాడు(జి) గురజాలలో 42.1°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 42°C డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *