AP&TG

2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టా దారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి-సీ.ఎం చంద్రబాబు

విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22 ఏ నుంచి తొలగిస్తూ..

పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్..

అమరావతి: రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టా దారు పాసు పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాలు సృష్టించింది. వీటిని పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రీ సర్వే 2.0లో భాగంగా ఇప్పటికి 6,976 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా… వీటితో 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పాసు పుస్తకాల పంపిణీ జరుగుతోంది. సర్వే పూర్తయిన మిగిలిన 1,259 గ్రామాలకు సంబంధించి 9 లక్షల పాసు పుస్తకాలను ఈ ఏడాది జూలై నాటికి పంపిణీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి రీ సర్వేతో పాటు…పాసు పుస్తకాల పంపిణీ 100 శాతం పూర్తి కావాలని ఆదేశించారు. దీని కోసం నెలవారీ లక్ష్యాలను సిద్ధం చేసుకుని కార్యాచరణ అమలు చేయాలన్నారు. జూలై తరువాత మార్చి లోపు 80 లక్షల పాసు పుస్తకాల పంపిణీ జరగాలని తేల్చి చెప్పారు. తప్పులకు ఆస్కారం లేకుండా పాసు పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు.

1.37 లక్షల ఎకరాల భూములకు విముక్తి:-1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22 ఏ నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇతర సర్వీస్ ఇనాం లోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పించనున్నారు. దీని కోసం కొత్తగా చట్టం తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

ఇంటి పట్టా ఉంటే… రిజిస్ట్రేషన్:- 2016కు మందు ఏదైనా ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.2016 ముందు పట్టా కలిగిన యజమాని… నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, విక్రయించేందుకు, గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. మీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీసీఎల్ఏ జయలక్ష్మితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *