పాకిస్తాన్ లో 8 గంటలకే షాపులు బంద్-ఇంధన కొరత
అమరావతి: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ ప్రభుత్వం దిక్కుతొచని స్థితిని ఎదుర్కొంటుంది. దింతో ఇంధన పొదుపు చర్యలలో భాగంగా ఏప్రిల్ 7వ తేదీ నుంచి దేశంలోని చాలా ప్రాంతాలలో రాత్రి 8 గంటల నుంచి మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ను ముందుగానే మూసివేయాలని ఆదేశించింది. ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటన జారీ చేసింది. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్తాన్-పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లలోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, డిపార్ట్ మెంటల్ స్టోర్లు-నిత్యావసర వస్తువుల దుకాణాలు రాత్రి 8 గంటలకే మూసివేయాలని అదేశించారు.. ప్రజల ఇళ్లల్లో రాత్రి 10 గంటల తరువాత పెళ్లిళ్లకు సంబంధించి కార్యక్రమాలు ఏవీ నిర్వహించకూడదు. ఫార్మసీలు, ఇతర హెల్త్ కేర్ సర్వీసెస్‌కు సంబంధించిన షాపులకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపును ఇచ్చింది.

