సోమ,మంగళవారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు-విపత్తుల నిర్వహణ సంస్థ
ఆదివారం నెల్లూరు(జి) నెల్లూరుపాలెంలో 42.4°C..
అమరావతి: సోమ,మంగళవారాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు ప్రభావం చూపే విభిన్న వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొననున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ-పరిసర ప్రాంతాలపై మరోక ఉపరితల ఆవర్తనము విస్తరించి ఉందని పేర్కొన్నారు.
సోమ, మంగళవారాల్లో వాతావరణం:- శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరిః, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
నెల్లూరు(జి) నెల్లూరుపాలెంలో 42.4°C.:- ఆదివారం మన్యం(జి) వీరఘట్టం,నెల్లూరు(జి) నెల్లూరుపాలెంలో 42.4°C, తిరుపతి(జి) రేణిగుంటలో 42.3°C, మార్కాపురం(జి) నందన మారెళ్లలో 41.8°C, కడప(జి) ఒంటిమిట్టలో 41.5°C, కృష్ణా(జి) పెద్దపారుపూడిలో 41.3°C, చిత్తూరు(జి) పలమనేరు, ప్రకాశం(జి) చెరువుకొమ్ము పాలెంలో 40.9°C, కర్నూలు(జి) తోవి, శ్రీకాకుళం(జి) జి. సిగడాంలో 40.7°C, అనంతపురం(జి) భట్టువానిపల్లిలో 40.5°C, పల్నాడు(జి) గురజాలలో 40.4°C, విజయనగరం(జి) సంతకవిటిలో 40.3°Cలుగా నమోదు అయింది. ఎండ తీవ్రత,ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

