AP&TGCRIME

ఆత్మహత్యకు పాల్పపడిన కుటుంబం-తల్లి,కుమారై మృతి భర్త పరిస్థితి విషమం

అమరావతి: పల్నాడు జిల్లా నరసారావుపేట, 1 టౌన్ పరిధి, దినేష్ లాజ్డీలో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పపడగా  3 సంవత్సారల కుమారై,తల్లి మృతి చెందగా, భర్త చావు బ్రతుకుల్లో వున్నాడు. సి.ఐ షేక్.ఫిరోజ్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పల్నాడు జిల్లాకు చెందిన రాత్రి కె.గోపి (37) అనే వ్యక్తి భుపాల్ లో ఒక ఆసుపత్రిలో అస్థీసీయా డాక్టరుగా పనిచేస్తున్నాడు.అతరి భార్య శంకరకుమారి(30) నర్సుగా పని చేస్తొంది.వీరికి మౌనిక (3) కుమారై వుంది.  కుమారైకు డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి వున్నట్లు తేలడంతో మానసిన ఒత్తిడి లోనై భార్య,భర్తలు నరసారావుపేటకు చేరుకుని దినేష్ గ్రాండ్ అనే లాడ్జీలో రూమ్ తీసుకున్నరు. వృత్తి రీత్యా వైద్యులు కావడంతో, చేతికి సెలైన్ ఎక్కించే క్యాన్ అమర్చుకుని,దాని ద్వారా మత్తు మందు ఇన్ జెక్టు చేసుకున్నట్లు తెలుస్తొంది.వాళ్ల కుటుంబ సభ్యులకు సెల్ ద్వారా ఫోటోలు, లాడ్జీ లోకేష్ ను షేర్ చేశారు. దింతో అతని తమ్ముడు ఘటన స్థలంకు చేరుకుని,చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించినప్పటికి,తల్లి,కుమారై మృతి చెందగా,గోపి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకుని జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సి.ఐ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *