ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమరావతి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారంనాడు ఫోన్ చేశారని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులు, హోర్ముజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించారని పేర్కొన్నారు.”అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడే ప్రధాని మోదీతో మాట్లాడారు”. హోర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరంతో పాటు పశ్చిమాసియాలో పరిస్థితిపై ఉభయులూ చర్చించారు అని సెర్గియో గోర్ వెల్లడించారు.
ట్రంప్‌తో పశ్చిమాసియా పరిస్థితులపై:- అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోనులో సంభాషించినట్టు ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై తమ మధ్య ఉపయోగకరమైన చర్చ జరిగిందన్నారు. వీలైనంత త్వరలో ఉద్రికతలు తొలగేందుకు, శాంతి పునరుద్ధరణకు భారత్ మద్దతు ఉంటుందని తాను స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి తెరవడం, రక్షణ కల్పించడం, అందరికీ అందుబాటులోకి తేవడం యావత్ ప్రపంచానికి అవసరమని పేర్కొన్నారు.

