NATIONAL

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో ప్రదాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం

నిరంతర సరఫరా, సమర్థ పంపిణీపై..

అమరావతి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన నాలుగు వారాలు అవుతుతున్న నేపథ్యంలో పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించిన పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా నిరంతర సరఫరా, సమర్థ పంపిణీపై ప్రధాని మోదీ చర్చించారు. వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్రం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హర్మూజ్‌ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలో ఉంచుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ చాలా తక్కువ నౌకలను మాత్రమే దీని ద్వారా అనుమతిస్తోంది. ఈ దిగ్బంధం వల్ల భారత్ సహా అనేక దేశాలకు ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దింతో ప్రధాని మోదీ ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్స్, మలేషియా, ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. దేశంలో గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి, సరఫరా ఒత్తిళ్లను తగ్గించడానికి కేంద్రప్రభుత్వం,సిటీ గ్యాస్ ప్రాజెక్టుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, పీఎన్‌జీకి మారాలని పట్టణ, నగరాల్లోని వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు సూచించింది. గృహ ఎల్పీజీ సరఫరా స్థిరంగా ఉందని, పంపిణీ కేంద్రాల వద్ద ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని, పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *