NATIONAL

భారతదేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని అదికమించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం అధిపతిగా పనిచేసి భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. దీంతో, 8,930 రోజుల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్‌ను ప్రధాని మోదీ అధిగమించారు. 2026 మార్చి 22న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొత్తం 8,931 రోజుల పాటు పదవిలో ఉండి, భారతదేశ చరిత్రలో ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం పనిచేసిన అధిపతిగా ఒక ప్రధాన రికార్డును నెలకొల్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా తన పదవీకాలాన్ని కలుపుకొని ఆయన ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా 8,931 రోజులు పూర్తి చేసుకుని, నాయకత్వ పాత్రలో తన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. భారతదేశ చరిత్రలో ఒక అరుదైన పేజీని తన పేర నమోదు చేసుకున్నారు. దశాబ్దాలుగా అత్యున్నత స్థాయిలో నిరంతర ప్రజా సేవ,రాజకీయ నాయకత్వానికి ప్రతిబింబిస్తొంది.

2014, 2019,2024లో:- తన రాజకీయ జీవితంలో, ప్రధాని మోదీ గుజరాత్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేయడం, ముఖ్యమంత్రిగా అత్యంత సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రధానమంత్రి కావడం వంటి అనేక ముఖ్యమైన రికార్డులను నెలకొల్పారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా ఆయనే. అంతేకాకుండా, 2014, 2019,2024లో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించారు. ఈ ఘనత ఆయన రాజకీయ సుదీర్ఘా ప్రయాణం, నిరంతరం ప్రజలు అయన పట్ల తమకు వున్న ప్రేమ, నమ్మకంను తెలియచేస్తొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *