DISTRICTS

సంతపేట మార్కెట్ పునరుద్ధరణతో వ్యాపారుల జివనోపాధి గాడిన పడింది-మంత్రి నారాయణ

15 కీలక ప్రాంతాల్లో డ్రైనేజీ, సిమెంట్ రోడ్ల పనులు ముమ్మరం..

కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో..

నెల్లూరు: ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మాట కూటమి ప్రభుత్వం నిలపెట్టుకున్నదని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. శుక్రవారం

శుక్రవారం నగరంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేసారు. ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. పరిశ్రమలు నెలకొల్పి లక్ష్యాన్ని చేరుకొనేందుకు సీఎం చంద్రబాబు,యువనేత లోకేష్ అలుపెరగని కృషిచేస్తున్నారన్నారు.

కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో:- గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన సంతపేట మార్కెట్‌ను యుద్ధప్రతిపాదికన పునరుద్ధరిస్తూ, వ్యాపారుల కోరిక మేరకు ప్రతి షాపుకు మెట్లు, మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో కొత్త పరిశ్రమల స్థాపన, నెలాఖరుకల్లా MSME క్లస్టర్ పూర్తి, 10,060 పోస్టులతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నగరంలోని  పొగతోట సహా 15 కీలక ప్రాంతాల్లో డ్రైనేజీ, సిమెంట్ రోడ్ల పనులను ముమ్మరం చేస్తూ నెల్లూరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మంత్రి వెంట మేయర్ సుజాత, కమిషనర్ నందన్,టీడీపీ నాయకురాలు రేవతి, విజయలక్ష్మి,ఇతర ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *