రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఆవకాశం
అమరావతి: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఆవకాశం వుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశలు వున్నయని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకొవాలని,, పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని హెచ్చరించారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని సూచించారు.

