AP&TGDEVOTIONALOTHERS

తిరుమలలో విస్తృతంగా అందుబాటులో లగేజీ డిపాజిట్ – డెలివరీ కేంద్రాలు-టీటీడీ

భక్తుల లగేజీ భద్రతకు టీటీడీ భరోసా..

80 కౌంటర్లు – 394 మంది సిబ్బంది – మూడు షిఫ్టుల్లో నిరంతర సేవలు

తిరుపతి: శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టీటీడీ విస్తృత స్థాయిలో లగేజీ డిపాజిట్ మరియు డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోందని టీటీడీ అధికారులు తెలిపారు.

భక్తులు దర్శనం, సేవలు, కాలినడక యాత్ర సమయంలో తమతో తీసుకువచ్చే లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను భద్రంగా ఉంచుకునేందుకు తిరుమలలో మరియు కాలినడక మార్గాల్లో కలిపి మొత్తం 80 కౌంటర్లు ఏర్పాటు చేసి 394 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరంగా సేవలందిస్తున్నారు.

కాలినడక భక్తులకు ప్రత్యేక డిపాజిట్ సౌకర్యం:- అలిపిరి మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అలిపిరి కాలినడక మార్గం ల‌గేజీ కేంద్రం వివ‌రాలు:-  7 కౌంటర్లు… 46 మంది సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 15 మంది)…10,194 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం…

శ్రీవారి మెట్టు ల‌గేజీ కేంద్ర వివ‌రాలు:-  2 కౌంటర్లు… 10 మంది సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 5 మంది)… 3,025 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం.ఈ కేంద్రాల్లో లగేజీ డిపాజిట్ చేసిన భక్తులు తిరుమలలోని డెలివరీ కేంద్రాల్లో సులభంగా తిరిగి పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది.

తిరుమలలో ప్రధాన డిపాజిట్ కేంద్రాలు:- తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల కోసం లగేజీ మరియు సెల్ ఫోన్ డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉంది.

ఫ్రీ హాల్ – 10 కౌంటర్లు, 36 సిబ్బంది (17,291 సెల్ ఫోన్లు, 7,793 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం)… వైకుంఠం క్యూకాంప్లెక్స్– 2 కౌంటర్లు, 6 సిబ్బంది (4,270 సెల్ ఫోన్లు)…నారాయణగిరి షెడ్ – 8 కౌంటర్లు, 30 సిబ్బంది (11,941 సెల్ ఫోన్లు, 6,749 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం)…డీడీ హాల్ – 3 కౌంటర్లు, 20 సిబ్బంది (2,526 సెల్ ఫోన్లు, 324 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం).. రూ.300 హాల్ – 5 కౌంటర్లు, 27 సిబ్బంది (6,338 సెల్ ఫోన్లు, 1,600 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం)…వైకుంఠం క్యూకాంప్లెక్స్ అప్ స్కానింగ్ (కంపార్ట్‌మెంట్-03) – 2 కౌంటర్లు, 15 సిబ్బంది.

కల్యాణకట్ట సమీపంలో ప్రత్యేక డిపాజిట్ – డెలివరీ కేంద్రాలు:- తలనీలాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట సమీపంలో కూడా ప్రత్యేక కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది..KKC 1, 2, 3 – 3 కౌంటర్లు, 18 సిబ్బంది (షిఫ్ట్-06) (688 సెల్ ఫోన్లు, 820 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం)…సుపథం కౌంటర్ – 1 కౌంటర్, 6 సిబ్బంది (షిఫ్ట్-02) (1,286 సెల్ ఫోన్లు, 245 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం)…సీనియర్ సిటిజన్ / దివ్యాంగులు (PHC) – 1 కౌంటర్, 2 సిబ్బంది (265 సెల్ ఫోన్లు, 75 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం)…వాక్యూసి-1 మెయిన్ గేట్ (శ్రీవాణి ట్రస్ట్) – 1 కౌంటర్, 6 సిబ్బంది (షిఫ్ట్-02)

తిరుమలలో లగేజీ డెలివరీ కేంద్రాలు:- డిపాజిట్ చేసిన లగేజీని తిరిగి పొందేందుకు కింది డెలివరీ కేంద్రాలు పనిచేస్తున్నాయి…అలిపిరి ఫుట్‌పాత్ డెలివరీ (జీఎన్సీ వ‌ద్ద‌) – 5 కౌంటర్లు, 53 సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 18 మంది), 9,345 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం…శ్రీవారి మెట్టు డెలివరీ (టీబీసీ వ‌ద్ద‌) – 2 కౌంటర్లు, 24 సిబ్బంది (ప్రతి షిఫ్ట్‌లో 8 మంది), 2,482 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం.

PAC-4 కౌంటర్లు…కౌంటర్లు 1–4: 16 కౌంటర్లు, 48 సిబ్బంది (20,477 సెల్ ఫోన్లు, 7,899 లగేజీ డిపాజిట్ల సామ‌ర్థ్యం)…కౌంటర్ 07: 4 కౌంటర్లు, 16 సిబ్బంది…కౌంటర్ 08: 4 కౌంటర్లు, 16 సిబ్బంది…కౌంటర్ 05: 4 కౌంటర్లు, 15 సిబ్బంది…లగేజీ డిపాజిట్ – డెలివరీ ప్రక్రియ.

టీటీడీ లగేజీ డిపాజిట్ కేంద్రాల్లో భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసే సమయంలో సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా క్యూఆర్ కోడ్ జెనరేటర్ చేసి బ్యాగుపై కోడ్ స్కిక్కర్ వేస్తారు. ఆ తర్వాత లగేజీకి సంబంధించిన సమాచారంతో ఒక స్లిప్ జెనరేట్ చేసి భక్తులకు అందిస్తారు. డిపాజిట్ డెలివరీ సమయంలో డెలివరీ కేంద్రంలో ఆ స్లిప్ సిబ్బందికి చూపితే ఆ నెంబర్ ఆధారంగా లగేజీని సులభంగా గుర్తించి ఒక నిమిషంలోపు లగేజీని భక్తులకు అందిస్తారు.

పండుగలు, ప్రత్యేక దినాల్లో భారీ వినియోగం:- టీటీడీ కల్పించిన ఈ సేవలను భక్తులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. 2026 జనవరి నెలలో అత్యధికంగా 10,44,268 డిపాజిట్లు న‌మోద‌య్యాయి. 2026 జనవరి 25రథసప్తమి రోజున అత్య‌ధికంగా 1,34,749 డిపాజిట్లు న‌మోదయ్యాయి. వైకుంఠ ఏకాదశి, గరుడసేవ, రథసప్తమి వంటి ఉత్సవాల సమయంలో భారీగా వినియోగం నమోదవుతోంది.

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి:- తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వద్ద ఉన్న లగేజీ, బ్యాగులు, సెల్ ఫోన్లను అధికారిక డిపాజిట్ కేంద్రాల్లో భద్రపరచి, టోకెన్ ఆధారంగా తిరిగి పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ కల్పిస్తున్న ఈ సేవల ద్వారా భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం పొందుతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *