మానసిక దివ్యాంగురాలికి సామాజిక పింఛన్ ను అందించిన జిల్లా కలెక్టర్
నెల్లూరు: నగరంలోని పొదలకూరురోడ్డులోని గౌతమి నగర్ రెండో వీధిలో మానసిక దివ్యాంగురాలికి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ ను అందించారు. మంగళవారం ఉదయం లబ్ధిదారురాలు భానుశ్రీ ఇంటికి వెళ్ళిన కలెక్టర్ రూ.15 వేలు పింఛను అందించారు. భానుశ్రీ, తల్లి కామాక్షమ్మతో మాట్లాడి చిన్నారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి భానుశ్రీని సమీపంలోని భవిత కేంద్రంలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడేందుకు వెంకటాచలంలోని సి ఆర్ సి కేంద్రానికి తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందించాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. కలెక్టర్ నేరుగా ఇంటికి వచ్చి పింఛను అందించడం పట్ల భానుశ్రీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక సచివాలయ సిబ్బంది విజయ్, జాస్మిన్, స్వాతి, శోభ ఉన్నారు.