పార్టీకంటే ఎక్కువ ఎవరూ కాదు-రాజా సింగ్ విషయంలో బీజేపీ
తెలంగాణ: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం పరాకాష్ఠకు చేరిందని,, పార్టీకంటే ఎక్కువ ఎవరూ కాదన్న విషయం గుర్తుంచుకోవాలని తెలంగాణ బీజెపీ కార్యలయం ఒక ప్రకటనలో తెలిపింది..రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నికలలో రాజాసింగ్ కూడా నామినేషన్ వేస్తానని పార్టీ కార్యాలయానికి వచ్చి,,జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ రాజాసింగ్ చర్చించారని తెలిపారు..రాజాసింగ్ కోరిక మేరకు నామినేషన్ పత్రాలు ఇచ్చి నామినేషన్ వేసుకునే అవకాశం ఇచ్చారని వెల్లడించారు..రాష్ట్ర ఎన్నికల అధికార శోభా కరండ్లాజేకి 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతో నామినేషన్ ఫామ్ సమర్పించవలిసి ఉండగా,రాజాసింగ్ కేవలం ముగ్గురు సభ్యుల సంతకాలతో ఉన్న ఫామ్ మాత్రమే సమర్పించారని తెలిపారు..ఎన్నికల నిబంధన ప్రకారం రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలలో పోటీ చేయడానికి 10 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల సంతకాలతో మరో ఫామ్ సమర్పించవలిసిందిగా శ్రీమతి శోభా కరండ్లాజే రాజాసింగ్ కోరారని పేర్కొన్నారు..
రాజాసింగ్ నామినేషన్ కి మద్దతిచ్చే స్టేట్ కౌన్సిల్ సభ్యులు లేక పోవడంతో,,పార్టీ పోటీ చేయనివ్వట్లేదని అబద్ధాలతో పార్టీపై అభాండాలు వేస్తున్నారని తెలిపారు..పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి సమర్పించిన రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి,, జాతీయ అధ్యక్షుడికి పంపించడం జరుగుతుందన్నారు..రాజాసింగ్ కి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు రాజీనామా లేఖ సమర్పించాలని సూచించారు.
పార్టీకంటే ఎక్కువ ఎవరూ కాదు…
గతంలో కూడా ఇలాంటి క్రమశిక్షణారాహిత్య వ్యవహారాలతో సస్పెండ్ అయితే మళ్లీ పార్టీలోకి తీసుకున్నాం. ప్రధానమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు నియోజకవర్గానికి ఇచ్చినా సరే వారి కార్యక్రమాలకు హాజరుకాకుండా పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా రాజాసింగ్ వ్యవహారం ఉంది..మా పార్టీకి వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం.. పార్టీ క్రమశిక్షణను అనేకసార్లు రాజాసింగ్ ఉల్లంఘించారని తెలిపారు.