AP&TGPOLITICS

డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు-ముఖ్యమంత్రి చంద్రబాబు

టీడీపీ ఎం.పి డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో,జాతీయస్థాయిలో మీడియా సైతం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఈ విషయంలో డిల్లీలో రాజకీయ వర్గాల్లో సైతం చర్చ జరుగుతొంది. తర్వలో 4 రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో,NDA కూటమి ప్రభుత్వంపై విరుచుకుని పడుతున్న ప్రతిపక్షాలు, ఎం.పీ పుట్టా.మహేష్ డ్రగ్స్ కేసును, రాజకీయ ప్రచార ఆస్త్రంగా వాడుకునే అవకాశం వుంది. ఈ విషయాలను దృష్టిలో వుంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు,ఎం.పీ విషయంను సీరియస్ గా తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.

అమరావతి: తెలంగాణ మొయినాబాద్ డ్రగ్స్‌ కేసులో పట్టుబడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్‌పై ఆరోపణలను చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పూట్టా.మహేష్‌ను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఆరోపణలకు సంబంధించి వివరణ కోరుతూ పుట్టా మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని,అలాగే పుట్టా మహేశ్‌ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను చంద్రబాబు ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యక్తులు,,నాయకులు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *