వంట గ్యాస్ కొరత లేదు వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు-కమీషనర్ సౌరవ్ గౌర్
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం వంట గ్యాస్ కొరత లేదని వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ సౌరవ్ గౌర్ స్పష్టం చేశారు.మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంటగ్యాస్ సరఫరాకు ఆటంకం లేకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.రాష్ట్రంలో ఎల్పిజి కనెక్షన్ల తాజా పరిస్థితిని ఆయన వివరిస్తూ మొత్తం కనెక్షన్ల సంఖ్య 161.19 లక్షలు వున్నాయన్నారు.
వాటిలో IOCL: 56.86 లక్షలు (20.79 లక్షల డబుల్ బాటిల్ + 36.07 లక్షల సింగిల్ బాటిల్). HPCL: 74.11 లక్షలు (28.75 లక్షల డబుల్ బాటిల్ + 45.36 లక్షల సింగిల్ బాటిల్) BPCL: 30.22 లక్షలు (11.13 లక్షల డబుల్ బాటిల్ + 19.09 లక్షల సింగిల్ బాటిల్) కనెక్షన్లు ఉండగా రోజువారీ LPG అవసరం దేశీయ ఉపయోగం: 4,000 mt; నాన్-డొమెస్టిక్ (వాణిజ్య) వాడకమని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని సౌరవ్ గౌర్ తెలిపారు.కొన్ని సోషల్ మీడియాల్లో వినియోగదారులను తప్పుదారి పట్టిస్తూ,తగినంత ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులో లేదన్న వదంతులు వాస్తవం కాదని స్పష్టం చేశారు. వంట గ్యాస్ దుర్వినియోగం నిరోధించడానికి OTP- ఆధారిత డెలివరీ ప్రమాణీకరణ అమలు చేయబడుతోందని పేర్కొన్నారు. పెండింగ్ బుకింగ్స్ యొక్క పర్యవేక్షణ డిస్ట్రిబ్యూటర్ వారీగా, మార్కెట్ వారీగా, జిల్లా వారీగా, సేల్స్ ఏరియా వారీగా, ప్రాంతం-వారీగా ఎప్పటి కప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి పరిశ్రమలకు బల్క్ LPG సరఫరా నిలిపివేయడం జరిగిందని తెలిపారు.వాణిజ్య (కాని దేశీయ) సరఫరా తీవ్రంగా పరిమితం చేయబడ్డాయని చెప్పారు.
ముఖ్యమైన విభాగాలు (ఆసుపత్రులు, హాస్టల్స్, ప్రభుత్వ సేవలు) వాణిజ్య సరఫరా కోసం ప్రాధాన్యత ఇవ్వడం జరిగుతోందని స్పష్టం చేశారు.
జిల్లా స్థాయిలో రెవెన్యూ, పౌరసరఫరాలు,పోలీస్ తదితర విభాగాల అధికారులతో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ఎల్పిజి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేయిస్తున్నారు.ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఎల్పిజి స్టాక్ పాయింట్లను తనిఖీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కమీషనర్ సౌరవ్ గౌర్ స్పష్టం చేశారు.

