AP&TGMOVIESOTHERS

గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ‌ ప్రభుత్వం గద్దర్ పేరిట ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రవేశపెట్టింది.2025 సంవ‌త్సారానికి సంబంధించి గ‌ద్ద‌ర్ అవార్డుల విజేత‌ల‌ను, జ్యూరీ స‌భ్యులు ప్ర‌క‌టించారు. 2025 జ‌న‌వ‌రి 1 నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు సెంట్ర‌ల్ బోర్డు ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ ద్వారా స‌ర్టిఫికేట్ పొందిన సినిమాల‌కు ఈ అవార్డులను ప్ర‌క‌టించారు.17 విభాగాల్లో అవార్డుల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు వెల్లడించారు. సామాజిక‌, సందేశాత్మ‌క చిత్రాల‌కు ప్ర‌త్యేక అవార్డుల‌తో పాటు డాక్ట‌ర్ సినారే, ఏఎన్ఆర్ పేర్ల‌తో ప్రత్యేక పుర‌స్కారాల‌ను అందచేయనున్నారు.

ఉత్త‌ర న‌టుడిగా నాగచైత‌న్య‌(తండేల్), ఉత‌మ న‌టిగా ర‌ష్మిక (ది గ‌ర్డ్ ఫ్రెండ్‌)ను ఎంపిక చేశారు. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పుర‌స్కారంతో,,ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌కు పైడి జ‌య‌రాజ్ అవార్డు,,గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌ను సినారే అవార్డు,,జ‌య‌సుధ‌ను అక్కినేని నేషనల్ అవార్డులు,ఉగాది సంద‌ర్భంగా మార్చి 19వ తేదిన  ప్ర‌ధానం చేయ‌నున్నారు. విజేత‌ల‌ జాబితాను జ్యూరీ స‌భ్యులు, తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కు అంద‌జేశారు.

స్పెష‌ల్ అవార్డులు:- ఎన్టీఆర్ నేషనల్ అవార్డు-చిరంజీవి…అక్కినేని నేషనల్ అవార్డు-జయసుధ…పైడి జయరాజ్ అవార్డు-కమల్ హాసన్…నాగిరెడ్డి, చక్రపాణి అవార్డు-అశ్వినీదత్…జీవన రెడ్డి అవార్డు-సింగీతం శ్రీనివాసరావు… కాంతారావు అవార్డు-ఆర్ నారాయణమూర్తి…రఘుపతి వెంకయ్య అవార్డు-రమేష్ ప్రసాద్…సినారె అవార్డు-సుద్దాల అశోక్ తేజ…

ఫీచ‌ర్ ఫిల్మ్స్:- ఉత్తమ నటుడు-నాగ చైతన్య (తండేల్‌)…ఉత్తమ నటి-రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)…ఉత్తమ చిత్రం-రాజు వెడ్స్ రాంబాయి…ఉత్తమ ద్వితీయ చిత్రం-దండోరా…ఉత్తమ తృతీయ చిత్రం-ది ప్రీ వెడ్డింగ్‌ షో…నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా-తండేల్‌…ఉత్తమ పర్యావరణ చిత్రం-ఇగ్వా…ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్-లిటిల్‌ హార్డ్స్…ఉత్తమ వినోదాత్మక చిత్రం-సంక్రాంతికి వస్తున్నాం…ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం-కోర్టు…ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ-మిరాయ్‌…ఉత్తమ బాలల చిత్రం-అనగనగనా…ఉత్తమ దర్శకుడు-సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)…ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు-శివాజీ… ఉత్తమ సపోర్టింగ్‌ నటి-భూమిక…ఉత్తమ సంగీత దర్శకుడు-మార్క్ కె రాబిన్‌ (దండోరా)…ఉత్తమ నేపథ్య గాయకుడు-అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి)…ఉత్తమ నేపథ్య గాయని-సాహితి చాగంటి (కన్నప్ప)…ఉత్తమ హాస్యనటుడు-కృష్ణ తేజ (జిగ్రీస్‌)…ఉత్తమ బాలనటుడు-రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)…ఉత్తమ కథా రచయిత-గుణశేఖర్‌ (యుఫోరియా)..ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌-అనిల్‌ రావిపూడి…ఉత్తమ గేయ రచయిత-నందకిశోర్‌ (కుబేర)…ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌-కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)…ఉత్తమ ఎడిటర్‌-శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)…ఉత్తమ ఆడియోగ్రాఫర్‌-ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కిందపురి)…ఉత్తమ కొరియోగ్రాఫర్‌-గిర గిర గిర…ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌-తోట తరణి ఛాంపియన్‌… ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్-గోవింద్‌ అఖండ…ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌-చాంపియన్‌– చంద్రకాంత్‌.

స్పెష‌ల్ జ్యూరీ అవార్డులు:- ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్-23…ఉత్తమ మేల్‌ యాక్టర్‌-చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)…ఉత్తమ నటి-అనంతిక (8 వసంతాలు)…స్పెషల్‌ జ్యూరీ హీరో-రోషన్‌ (చాంపియన్‌).

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *