సైనిక చర్యలకన్నా చర్చలు, రాజనీతే శాశ్వత పరిష్కాం ఇస్తాయి-ప్రధానీ మోదీ
అమరావతి: భారతదేశం “చట్ట బద్దమైన పాలన,చర్చలు,దౌత్యం ద్వారా సమస్యలకు పరిష్కారం వస్తుందని” నమ్ముతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.”సైనిక వివాదం ద్వారా మాత్రమే ఏ సమస్యనూ పరిష్కరించలేము” అని అన్నారు. పశ్చిమాసియాలో లేదా ఉక్రెయిన్‌లో జరిగినా, వివాదాలను త్వరగా ముగించడానికి-శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నానికి న్యూఢిల్లీ మద్దతు ఇస్తూనే ఉంటుందని అన్నారు. గురువారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచం అస్థిరత, అనిశ్చితి దశలో ఉంది. ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు అనేక ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయని,దౌత్యపరమైన సంభాషణల ద్వారానే శాంతి నెలకుంటుందని భారత్, ఫిన్లాండ్ దేశాలు బలంగా నమ్ముతాయని అన్నారు.
క్వాంటమ్ కంప్యూటింగ్:- భారత్– ఫిన్లాండ్ ద్వైపాక్షిక సంబంధాలను కొత్త దశకు తీసుకెళ్తున్నట్టు వెల్లడించారు. డిజిటలైజేషన్, సస్టైనబిలిటీ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6జీ టెలికాం, క్లీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. ఆ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య సాంకేతిక, ఆర్థిక సహకారానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.
ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ ప్రసంగిస్తూ ప్రపంచ వ్యవస్థ మార్పు దశలో ఉందని, గ్లోబల్ సౌత్ దేశాలు భవిష్యత్ దిశను నిర్ణయిస్తాయని తెలిపారు. భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ బహిరంగ మద్దతు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు స్థానం అత్యంత అవసరమని అన్నారు. అంతకు ముందు ఇరుదేశాల ప్రతినిధులు పలు ద్వైపక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

