టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ-నూతన ఈఓగా రవిచంద్రకు అదనపు బాధ్యతలు
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేస్తు అయన స్థానంలో నూతన ఈఓగా ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రవిచంద్ర ప్రస్తుతం సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్ కుమార్ సింఘాల్, జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సింఘాల్ గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకు టీటీడీ ఈవోగా పని చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పటి ఈఓగా వున్న అనిల్‌కుమార్ సింఘాల్,, అదనపు ఈఓ ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ ఎకౌంట్స్ ఆఫీసర్ బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇటీవల సిట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

