గుజరాత్‌లోని కచ్ జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు
అమరావతి: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శుక్రవారం వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. రాజ్ కోట్ కు 160 కి.మీల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలిపింది. భూ ప్రకంపనలు రాగానే అక్కడి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల ప్రభావిత ప్రాంతంను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు.

