రాష్ట్ర వ్యాప్తంగా ఏసిబీ అధికారుల దాడులు-పాత తంతు పునరవృత్తం అవుతుందా?
తనిఖీలు జరుగుతునే వుంటాయి?
అవినీతి పాల్పడుతూ ఏసీబీ చిక్కిన అధికారులు,, కొన్ని నెలల వ్యవధిలో మరో చోట పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు ? అంటే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఇలా జరుగుతుందా? అవినీతికి పాల్పపడే అధికారులు,,నెల నెల సంబంధిత నాయకులకు మాముళ్లు పంపిస్తూన్నాం? ఈ పోస్టింగ్ కోసం కోట్ల రూపాయలు అమ్యామ్యలు సమర్పించుకున్నాం? మరి మేం ఇచ్చిన మ్యామ్యలు తిరిగి సంపాధించుకోవాలి? అలాగే నాలుగు రాళ్లు వెనక వెసుకోవాలంటూ బహిరంగం వ్యాఖ్యనిస్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు విదితమే.. కొన్ని జిల్లాల్లో ఏసిబీ అధికారులు,, అవినీతికి పాల్పపడే అధికారులకు పరోక్ష మద్దతు ఇస్తున్నరంటూ ప్రజలు మట్లాడుకుంటున్నారు అంటే…పరిస్థితి ఏ స్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు..నిజాయితీగా వ్యవహరించే కొంత మంది నాయకులు,,అధికారులు తప్ప… మిగిలిన వారంతా???? ఈ నేపధ్యంలో నేడు ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా దాడలు చేసింది…
అమరావతి: అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది..ప్రయోజనం ఏమన్న వుంటుదా? ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులపై అక్రమ సంపాదన ఆరోపణలు రావడంతో ఏసీబీ హడవిడి మొదలు పెట్టారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల నివాసాల్లో ఈ సోదాలు కొనసాగాయి. సోదాల సమయంలో కీలక ఫైళ్లు, కంప్యూటర్ డేటా, లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అటు తరువాత జరిగే తంతు పైన చెప్పిన విధంగా వుంటుంది.?
ఆకస్మిక తనిఖీల్లో 4 చోట్ల క్రిమినల్ కేసులు ఏసీబీ అధికారులు నమోదు చేశారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి చెందిన 14 ఇళ్లలో సోదాలు చేపట్టారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, నెల్లూరు జిల్లాలోని స్టోన్‌హౌస్‌పేట, విశాఖపట్నం జిల్లాలోని మధురవాడ, పల్నాడు జిల్లా నరసరావుపేట తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనిశా అధికారులు తనిఖీలు చేపట్టారు.అప్పుడప్పుడు తనిఖీలు చేస్తునే వుంటారు? కేసులు నమోదు చేస్తునే వుంటారు..?

