Uncategorized

ఎనిమిది మంది ఉగ్రవాదులు ఆరెస్ట్

అమరావతి: ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ,భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో మరణ హోమం సృష్టించేందుకు ఉగ్రదేశమైన పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే వుంది.ఈ నేధ్యంలో ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ ద్వారా గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటు కోసం చేసిన కుట్ర బయట పడింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, గురువారం గుజరాత్ ATS అధికారులు గుజరాత్‌లోని బనస్కాంత, పటాన్, నవ్‌సారితో పాటు పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ ప్రాంతంలో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఈ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.నిందితులను అహ్మద్ గాజీవాలా, ఇబ్రహీం ఘాఘా, ముదస్సిర్ గాజీవాలా, జకారియా దురానీ, ముఫ్తీ ఫౌజాన్ దౌవా, మహ్మద్ అమీన్ పాలన్‌పురి, మహ్మద్ అబ్దుల్ సావ్దీ, బిలాల్ దురానీ ఘాఘాగా గుర్తించారు. వీరిలో ముగ్గురు సిద్ధ్‌పూర్, చిఖ్లీలోని మతపరమైన విద్యాసంస్థలతో సంబంధం ఉన్నట్లు తేలింది. నిందితులంతా జైష్-ఎ-మహ్మద్ సంస్థ తరఫున యాక్టివ్‌గా పనిచేస్తూ, గుజరాత్ వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ ను బలోపేతం చేయడానికి పని చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా యువతను రిక్రూట్‌ చేయడానికి పథకం సిద్దం చేసినట్లు అధికారులు కనుగొన్నారు. అధికారులు అరెస్టైన వారిపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. వారినుంచి డిజిటల్ పరికరాలు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సంస్థతో దేశవ్యాప్త సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *