ఈ సంక్రాంతి ప్రతి కుటుంబంలో ఆనందం నింపాలి-మంత్రులు నారాయణ,రామనారాయణ,కలెక్టరు
రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
నెల్లూరు: తెలుగువారి పెద్ద పండుగ, ప్రతి కుటుంబంలో సంతోషం నింపే నిండైన పండుగ సంక్రాంతి అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు.నారాయణ,దేవాదయ,ధర్మదాయశాఖ మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి,జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ లు అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి వారసత్వానికి, మనుషులంతా కలిసి ఉంటే కలిగే ఆనందాలకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని, ఈ పండుగ అందరి కుటుంబాలలో అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సకల సౌభాగ్యాలు కలుగ జేసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు, రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రాంతి లక్ష్మి కరుణ కటాక్షాలు పుష్కలంగా ఉండాలని ఆకాంక్షించారు.